ఉత్పన్న ఏకాదశి నేడే. తెలుగు పంచాంగంలో ఏటా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి… ఉత్పన్న ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1.01 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3.47 గంటలకు ముగుస్తుంది. ఇక పూజ చేసేందుకు శుభసమయం ఉదయం ఆరు నుంచి 9 గంటల మధ్య ఉన్న కాలం.