బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కధానాయకుడుగా మారిన సిద్ధార్ధ్(siddharth)ఈ నెల ఇరవై తొమ్మిదిన ‘మిస్ యు'(miss you)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.గతంలో నాగార్జున,కళ్యాణ్ రామ్ తో జత కట్టిన ఆషికా రంగనాద్ ‘మిస్ యు’ లో హీరోయిన్ గా చేస్తుండగా ఎన్ రాజశేఖర్(n rajasekhar)దర్శకత్వంలో శా మ్యూల్ మధ్యు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ట్రైలర్ అండ్ ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోగా జిబ్రాన్ సంగీతాన్నిఅందిస్తున్నాడు.
ఇక రిలీజ్ ని పురస్కరించుకొని చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.అందులో ఒక విలేకరి సిద్దార్ధ్ తో మీరు ఇరవై తొమ్మిదిన సినిమాని రిలీజ్ చేస్తున్నారు.మరి వారానికే అల్లు అర్జున్(allu arjun)హీరోగా వస్తున్న పుష్ప 2(pushpa 2)థియేటర్స్ లో రాబోతుంది.మరి మీ సినిమా బాగున్నా కూడా రెండో వారానికే థియేటర్స్ లో నుంచి మీ సినిమాని తీసివేసే అవకాశం ఉంటుంది కదా అని అడిగాడు.అప్పుడు సిద్దార్ధ్ మాట్లాడుతు’ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను నేర్చుకున్న విషయం ఒక్కటే.నా కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, ఆలోచిస్తాను, టెన్షన్ అవుతాను. అంతే కానీ నా కంట్రోల్ లో లేని విషయాల గురించి నేను మాట్లాడను.ప్రతి మూవీ బిగ్ మూవీనే.ఖర్చు ప్రకారం పెద్ద మూవీ చిన్న మూవీ అని చెప్పకూడదు.మా మూవీ ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ కూడా థియేటర్స్ లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి.
అందులో ఫస్ట్ నా మూవీ బాగుండాలి. ప్రేక్షకులకి నచ్చాలి.తర్వాత వేరే మూవీ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నా ప్రాబ్లం కాదు.నా సినిమా బాగుంటే థియేటర్స్ లో ఉంటుంది.సినిమా పధతికూడా అదే. ఒక మంచి సినిమాని ఎవరు కూడా థియేటర్స్ నుంచి తీసేయలేరు.ఎందుకంటే అందరు అన్ని చూస్తున్నారు. 2006 , 2007 లో ఆ విధంగా తీసేసారు. కానీ ఇప్పుడు తియ్యలేరు ఎందుకంటే సోషల్ మీడియా ఎవెర్ నెస్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.