మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరిగే కొద్దీ రాబడులు కూడా పెరుగుతాయి. ఏ వయసులో ఎంత పొదుపు చేయగలరో, మెచ్యూరిటీ సమయంలో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా భారీ రాబడిని పొందవచ్చు. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు బెటర్ ఆప్షన్. తక్కువ మొత్తంలో రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన రాబడికి గ్యారెంటీ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ పనితీరును మునుపటి సంవత్సరాల రాబడిని పరిశీలించడం ద్వారా అంచనా వేయవచ్చు.