మొత్తం 64 గొర్రెలు మృతి చెందాయి. మరో 10 గొర్రెలకు పైగా పరిస్థితి విషమంగా ఉంది. నంనూరుకు చెందిన గోపు రాజ్ కుమార్‌కు చెందిన 17, గోపు కొమరయ్యకు చెందిన 16, గోపు మల్లేశంకు చెందిన 16 గొర్రెలు, గోపు రమేశ్‌కు చెందిన 15 గొర్రెలు చనిపోయాయి. చనిపోయిన గొర్రెలకు డాక్టర్ శాంతిరేఖ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ గొర్రెలు అన్నీ వడ్ల గింజలు అధిక మొత్తంలో తిన్న కారణంగా చనిపోయినట్లు ధ్రువీకరించారు.