AP Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.