విశ్వాసం గల కుక్కపై అపరిమిత అభిమానం చాటుకున్నారు దంపతులు. పెంపుడు కుక్కకు జన్మించిన నాలుగు పిల్లలకు బారసాల నిర్వహించారు. లక్ష్మీ నరసింహ నామకరణం చేసి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టారు. అందరినీ ఆశ్చర్యానికి అంతకుమించిన ఆసక్తిని కలిగించిన కుక్కకు బారసాల వేడుకలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది.