బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడాన్ని మేం ఆందోళన చెందుతున్నాం. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై తీవ్రవాద మూకలు దాడి చేస్తున్నాయి. తాజాగా ఈ ఘటనతో మరింత పెరిగే అవకాశం ఉంది. మైనారిటీల గృహాలు, వ్యాపార సంస్థలను కాల్చడం, దోచుకోవడం, అలాగే దొంగతనం, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి అనేక కేసులు ఉన్నాయి.’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
Home International Chinmoyi Krishna Das : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్‌పై స్పందించిన భారత్-bangladesh...