పలుచోట్ల ఇబ్బందులు
తెలంగాణలో అత్యధిక వరి ధాన్యం దిగుబడి వచ్చే నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సమస్యాత్మకంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎన్ని భరోసా మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12.79 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకం వరి ధాన్యం పండించారు. దీనిద్వారా 29.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మార్కెటింగ్, ఐకేపీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో 870 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.