గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు
గంజాయి మత్తు పదార్ధాలను విక్రయించినా, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలతోపాటు పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రస్తుతం దగ్ధం చేసిన గంజాయి విలువ రూ.1,30,38,600 ఉంటుందని తెలిపారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులైన C. రాజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామగుండం, గోదావరిఖని ఏసీపీ ఎం .రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎసిపి మల్లారెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జి. సతీష్ , మల్లేష్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దహనం చేశామన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగుచేసి విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.