Konda Surekha : కొండా సురేఖ.. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్. వరంగల్ జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకురాలు. డైలాగ్లను బుల్లెట్లలా పేల్చే సురేఖ.. తాజాగా బాలిక పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. బాలిక చెప్పులు లేకుండా నడవటం చూసి చలించిపోయారు. వెంటనే కారు ఆపి.. బాలికను దగ్గరకు తీసుకున్నారు.