తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల రూపాయల ఆదాని చెక్కు వెనక్కిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రకటించారు. దీనిపై ఇవాళ స్పందించిన brs వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ఆదానీని తిట్టి, ఇక్కడ సుద్దపూస మాటలు ఎందుకని నిలదీశారు. నెత్తి మీద రాహుల్ గాంధీ రెండు దెబ్బలు ఏసేలోపు ఈ విషయం ఎరుక అయ్యిందా అని ప్రశ్నించారు.