ఇంకా చాలారకాల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ.. ఎక్కువగా ఈ 6 సర్టిఫికెట్ల కోసం ప్రజలు వస్తుంటారు. వారి దగ్గర మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది సైలెంట్ గా వెళ్లిపోతారు. టీజీ ఆన్‌లైన్, టీజీటీఎస్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.