తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరిత తగ్గాయి. నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 8.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.8 డిగ్రీలు నమోదయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, జిల్లాల్లోని పలు మండలాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.