హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పారు. అలాగే టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటు సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని.. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.