బిర్యానీ, పలావులో, పులిహోరలు అన్నీ అన్నంతో తయారయ్యేవే. వాటిని తింటేనే పొట్ట నిండుగా అనిపిస్తుంది. సంపూర్ణ భోజనం చేసినట్టు ఉంటుంది. కానీ అన్నాన్ని తినడానికి ఇప్పుడు భయపడి పోయే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి కారణం అన్నం ప్రతిరోజూ తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం. అందుకే అన్నాన్ని మానేసి చపాతీలు తింటున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. వైట్ రైస్‌ను ఒకపూట మాత్రమే తిని రెండో పూట చపాతీలో, రోటీలతో పొట్ట నింపుకుంటున్నారు. కానీ అది కూడా మనస్పూర్తిగా తినలేక పోతున్నారు. మీరు బరువు పెరగకుండా కూడా ప్రతిరోజూ అన్నాన్ని తినవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిన పద్ధతి అన్నాన్ని వండే స్టైల్ మార్చండి. ఏ విధంగా అన్నం వండితే బరువు పెరగకుండా ఉంటారో తెలుసుకోండి.