క్యారెట్ అల్లం సూప్‍కు కావాల్సిన పదార్థాలు
- 400 గ్రాముల క్యారెట్ (కడిగి గుడ్రంగా సన్నగా తరగాలి)
- ఓ ఇంచు అల్లం (చిన్న ముక్కలుగా తరగాలి)
- 6 వెల్లుల్లి రెబ్బలు
- ఓ బిర్యానీ ఆకు
- ఓ టీస్పూన్ మిరియాలు
- ఓ ఉల్లిపాయ తరుగు
- ఓ టేబుల్ స్పూన్ వంట నూనె
- రుచికి తగినంత ఉప్పు
- లీటర్ నీరు
క్యారెట్ అల్లం సూప్ తయారీ విధానం
- ముందుగా స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టుకొని నూనె పోయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం ముక్కలు వేసి వేపాలి.
- సుమారు రెండు నిమిషాల పాటు వాటిని వేగనివ్వాలి.
- దాంట్లో తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వెంటనే అర లీటర్ వరకు నీరు దాంట్లో పోయాలి.
- క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ప్యాన్‍పై మూత పెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి.
- క్యారెట్ ముక్కలు పూర్తిగా ఉడికాక.. ఆ మిశ్రమాన్నంతా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీన్ని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
- మెత్తగా ప్యూరీలా అయిన ఆ మిశ్రమాన్ని స్టెయినర్‌లో వేసి.. దాంట్లోనే అరలీటర్ నీరు పోసి కింద పెట్టుకున్న గిన్నెలో సూప్ పడేలా గరిటతో వత్తాలి. ఇలా నీటితో స్ట్రైనర్‌లో ప్యూరీని వడగితే పిప్పి నిలిచి.. సూప్ కింద గిన్నెలో దిగుతుంది.
- ఆ తర్వాత సూప్‍ను మళ్లీ ఓ ప్యాన్‍లో పోసుకొని స్టవ్‍పై బాగా మరిగించాలి. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సూప్ బాగా మరిగాక స్టవ్ ఆపేసి ప్యాన్ దించేలి. అంతే క్యారెట్ అల్లం సూప్ రెడీ అవుతుంది.
కాస్త తియ్యగా, ఘూటుగా ఈ క్యారెట్ అల్లం సూప్ అదిరిపోతుంది. అయితే, ఘూటు తక్కువగా ఉండాలనుకునే వారు అల్లం, మిరియాలు కాస్త తక్కువ వేసుకోవచ్చు. వేడివేడిగా ఈ సూప్ తాగితే అద్భుతంగా అనిపిస్తుంది.