దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం, గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి 810 కిమీ, పుదుచ్చేరికి 920 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Home Andhra Pradesh తరుముకొస్తున్న వాయుగుండం.. కంటతడి పెట్టిస్తున్న రైతుల కష్టాలు-farmers worried as heavy rain forecast for...