ప్రముఖ హీరోయిన్ శ్రీలీల(sreeleela)పుష్ప పార్ట్ 2(pushpa 2)లో ‘కిస్సక్’ అనే ఒక ప్రత్యేక గీతంలో చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల రిలీజైన ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుపోతుంది. ఇక శ్రీలీల పుష్ప 2 ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మరో మూవీ రాబిన్ హుడ్ లో హీరోయిన్ గా చేస్తుంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రెస్ మీట్ రీసెంట్ గా జరిగింది.
అందులో హీరో నితిన్(nithin)శ్రీలీలతో పాటు మైత్రి అధినేతలైన రవిశంకర్,నవీన్ కూడా పాల్గొన్నారు. ఒక రిపోర్టర్ శ్రీలీలతో మీరు పుష్ప 2 లో ప్రత్యేక గీతం చేసినందుకు గాను హీరోయిన్ గా ఒక సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో, అంత తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగాడు.అప్పుడు శ్రీలీల మాట్లాడుతు నేను ఇంతవరకు రెమ్యునరేషన్ తీసుకోలేదు.అసలు రెమ్యునరేషన్ ఎంతనే విషయం కూడా మాట్లాడుకోలేదని చెప్పింది.నిర్మాతలు కూడా అదే విషయాన్నీ చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.శ్రీలీల మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)బ్యానర్ పై తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్(pawan kalyan)ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.