వేడి వాతావరణంలో చల్లటి ప్రాంతానికి వెళ్లానిపిస్తుంది. అలాగే చల్లటి వాతావరణంలో మంచు కురిసే ప్రాంతాలకు వెళితే ఆ కిక్కే వేరు. అమెరికా, కెనడా, రష్యాల్లో ఎలా మంచు ముద్దలుగా కురుస్తుందో అలాంటి అందమైన ప్రదేవం పహల్గామ్. ఇక్కడ కనిపించే హిమపాతాలు స్వర్గాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పహల్గామ్. వీలైనప్పుడు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. ఒకపక్క మంచు పడుతూ ఉంటే మరో పక్క హిమపాతాలు కురుస్తూ ఉంటాయి. చెట్లపై మంచు మేటలు వేస్తుంది. నిశ్శబ్ద వాతావరణం, గాలి కాలుష్యం లేకుండా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పహల్గామ్. ఇక్కడకు వెళితే చూడాల్సి ప్రదేశాలు, ఎప్పుడు వెళితే ఉత్తమం వంటి విషయాలు తెలుసుకోండి.