అయితే నెతన్యాహు తన ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల నుంచి ఈ ఒప్పందంపై వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్లపై దృష్టి సారించడానికి, ఆయుధాల ఎగుమతులను భర్తీ చేయడానికి, దళాలకు విశ్రాంతి ఇవ్వడానికి అవకాశం లభిస్తుందని నెతన్యాహు అన్నారు. ఒప్పందాన్ని అమలు చేస్తామని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా దీటుగా స్పందిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ‘గెలిచే వరకు కలిసికట్టుగా పనిచేస్తాం. హిజ్బుల్లా యుద్ధం ప్రారంభంలో ఉన్న దానికంటే ఇప్పుడు బలహీనంగా ఉంది. దశాబ్దాలుగా దాన్ని వెనక్కి నెట్టివేశాం, సరిహద్దుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం.’ అని నెతన్యాహు చెప్పారు.
Home International హమ్మయ్య.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం-israel approves ceasefire agreement with hezbollah...