చికెన్ షేర్వా చేయడం కష్టం అనుకుంటారు. కానీ దీన్ని చాలా సులువుగా చేయొచ్చు. కేవలం తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు… తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా చికెన్ షేర్వాని ఇష్టంగా తింటారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రా కొన్ని ప్రాంతాల్లో దీన్ని సాల్నా అని పిలుస్తారు. అదే తెలంగాణ విషయానికొస్తే చికెన్ షేర్వా అని అంటారు. ఈ చికెన్ షేర్వా రెసిపీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ప్రత్యేకంగా వండుతారు. దీన్ని చపాతీ, రోటీలతో తింటే ఆ రుచి వేరు పైగా కాస్త స్పైసీగా చేసుకుంటే చలికాలంలో ఇంకా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇక రెసిపీ విషయం మీకు వస్తే అరగంటలో దీన్ని వండొచ్చు.