అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)వివాహం డిసెంబర్ 4 న అంగరంగ వైభవంగా జరగనుంది.అన్నపూర్ణ స్టూడియాలోని అక్కినేని నాగేశ్వరరావు(anr)విగ్రహం దగ్గర జరిగే ఈ వివాహ వేడుకకు కొద్దీ మంది అతిధులని మాత్రమే ఆహ్వానించబోతున్నారు.తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూర్తి చేస్తున్న నమ్మకం కూడా తనకి ఉందని చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పడంతో ఈ వివాహానికి ఉన్న ఇంపార్టన్స్ ని అర్ధం చేసుకోవచ్చు.
చైతు,శోభిత లు తమ వివాహాన్నిఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించి,ప్రేక్షకుల ముందుంచాలనే ప్లాన్ లో ఉన్నారని. ఈ మేరకు ఒక ఓటిటి సంస్ధతో డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తు ఉన్నాయి.ఇప్పుడు ఆ వార్తలపై అక్కినేని కాంపౌండ్ నుంచి అధికార ప్రకటన వచ్చింది. చైతు, శోభిత వివాహం ఓటిటి లో రాబోతుందని వార్తలు రూమర్స్ అని తేల్చి చెప్పడమే కాకుండా ఆ ఇద్దరు తమ వివాహాన్ని ప్రైవేట్‌గా మరియు వ్యక్తిగతంగా ఉంచుకోవడంపైనే దృష్టి పెట్టారని కూడా తెలిపింది.