పాన్ ఇండియాస్టార్ ప్రభాస్(prabhas)కెరీర్ ని ఒక్కసారి గమనిస్తే ‘ఈశ్వర్ నుంచి మిర్చి’ వరకు కూడా,హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే డ్యూయట్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఉండేవి.అందులో ప్రభాస్ వేసే స్టెప్స్ కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకునేవి.కానీ మిర్చి తర్వాత ఆ రేంజ్ డ్యూయట్ గాని, డాన్స్ గాని ప్రభాస్ కి రాలేదనే చెప్పాలి.అభిమానులు కూడా ఈ విషయంలో ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ది రాజాసాబ్(the raja saab)లో ఒక అధ్బుతమైన డ్యూయట్ తెరకెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఆ సాంగ్ లో మాళవిక మోహన్(malavika mohanan)తో కలిసి ప్రభాస్ చేసే రొమాన్స్ సూపర్ గా ఉండబోతుందని,డాన్సుల్లో కూడా వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్నాయి.యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఆ సాంగ్ చిత్రీకరించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని,త్వరలోనే యూనిట్ యూరప్ బయలుదేరి వెళ్తుందని కూడా చెప్తున్నారు.మరి ఈ విషయంలో మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఇక ప్రభాస్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం రాజాసాబ్ తో హర్రర్ ఎంటర్ టైనర్ జోనర్ ని టచ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన రాజాసాబ్ మోషన్ టీజర్ అయితే సినిమా మీద అందరిలో అంచనాలని పెంచింది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి మారుతీ(maruthi)దర్శకుడు కాగా, ప్రభాస్ సరసన మాళవిక మోహన్(malavika mohanan)తో పాటు నిధి అగర్వాల్ జత కడుతున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజె విశ్వ ప్రసాద్(tj viswa prasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది.