2002 లో రవితేజ(ravi teja)హీరోగా కృష్ణ వంశీ(krishna vamsi)దర్సకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటుడు సుబ్బరాజు.ఆతర్వాత ఎన్నో చిత్రాల్లో విలన్ గా,ఫ్రెండ్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని పొందాడు.  

రీసెంట్ గా సుబ్బరాజు(subbaraju)తన ఇనిస్టా అకౌంట్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తన శ్రీమతితో కలిసి ఒక బీచ్ లో దిగిన ఫోటోని షేర్ చేసాడు, అందులో ఇద్దరు పెళ్లి బట్టలతో ఉండటంతో సోషల్ మీడియా వేదికగా సుబ్బరాజుకి అభినందనలు తెలుపుతున్నారు.అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది, వధువు ఎవరనే విషయాలు మాత్రం సుబ్బరాజు వెల్లడి చెయ్యలేదు.కొన్ని రోజుల క్రితం సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో అనే విషయాన్నీ చెప్పిన  సుబ్బరాజు ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి  ఫొటోలతో కనపడటం టాక్ అఫ్ ది డే గా మారింది

 పలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించిన సుబ్బరాజు  ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఆర్య, సాంబ, భద్ర, నేనున్నాను,పోకిరి, దేశముదురు, పౌర్ణమి, యోగి,అతిధి,పరుగు, బుజ్జిగాడు, నేనింతే, దూకుడు, బుజ్జిగాడు,పవర్, శ్రీమంతుడు,అఖండ,మిర్చి,గద్దల కొండ గణేష్, బాహుబలి పార్ట్ 2 ,వాల్తేరు వీరయ్య లాంటి  చిత్రాలు సుబ్బరాజు కి మంచి గుర్తింపుని తెచ్చాయి.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here