ఏపీ లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ 2024:

  • నవంబర్ 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • నవంబర్ 27వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
  • నవంబర్ 29వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబర్ 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • రిపోర్టింగ్ గడువు నవంబర్ డిసెంబర్ 4వ తేదీతో పూర్తి అవుతుంది.
  • https://lawcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ లాసెట్‌ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here