ఈ దంపతులిద్దరినీ మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. బుధవారం మధ్యాహ్నం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటికి తెలిసింది. ఇంట్లో దంపతులు ఇద్దరే ఉండటాన్ని అదునుగా భావించిన దుండగులు బంగారు నగలు, నగదు కోసమే హత్య చేసి ఉంటారని తొలుత భావించారు. కాగా హత్య అనంతరం ఇంట్లో బంగారం, నగదు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఇవి పక్కా ప్రణాళికతో జరిగిన హత్యలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.