ఓటీటీలోకి లక్కీ భాస్కర్
లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. మూవీ ఇప్పటికే థియేటర్ల నుంచి కనుమరుగు కావడంతో.. స్ట్రీమింగ్కి సిద్ధమైంది. బుధవారం (నవంబరు 27) అర్ధరాత్రి నుంచే లక్కీ భాస్కర్ మూవీ స్ట్రీమింగ్కిరానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.