నీట్ పీజీ మినహా అన్ని పరీక్షల తేదీలు

నీట్ పీజీ 2025 తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ఈ తేదీలు తాత్కాలికమైనవని, పరిస్థితులను బట్టి తరువాత మార్చవచ్చని స్పష్టం చేసింది. ‘‘పైన పేర్కొన్న తేదీలు పూర్తిగా తాత్కాలికమైనవి. అవి అనుమతులు, ఇతర ధృవీకరణలకు లోబడి ఉన్నందున అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్లు / ఎన్బిఇఎంఎస్ వెబ్సైట్ నుండి పై పరీక్షల ఖచ్చితమైన తేదీలను తరచూ చెక్ చేసుకోవాలని ఎన్బీఈఎంఎస్ సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన సమాచార బులెటిన్లు, దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ natboard.edu.in ను చూడాలని కోరింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ డిసెంబర్ 2024), ఎన్బీఈఎంఎస్ డిప్లొమా ఫైనల్ థియరీ ఎగ్జామినేషన్ – డిసెంబర్ 2024 తేదీలను ఇప్పటికే ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here