జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని స్మశానంలో వదిలేశారు కసాయి కొడుకులు. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో మోతె స్మశానవాటికలో వృద్ధురాలు రాజవ్వ వదిలేశాడు. దీంతో ఆమె 8 రోజులుగా అక్కడే వృద్ధురాలు ఉంది.కొన్ని రోజుల క్రితం మద్యం మత్తులో కొడుకు తోసేయటంతో ఆమెకు కాలు సైతం విరిగింది. నలుగురు కుమారులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవటంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా రాజవ్వను ఆస్పత్రికి తరించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here