ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2367 మంది ప్రయోజనం పొందుతారని అంచనా వేశారు. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సీ బాధిత అభ్యర్థులున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.