రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)హంగామ ప్రారంభమయ్యిందని చెప్పుకోవాలి.రిలీజ్ డేట్ డిసెంబర్ 5 దగ్గర పడే కొద్దీ పుష్ప టీం అన్ని లాంగ్వేజెస్ లో రోజుకొక ఈవెంట్ ని నిర్వహస్తు అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చింది.మొన్న చెన్నై వేదికగా ఈవెంట్ జరగగా ఈ రోజు కేరళలో జరగనుంది.ఇందులో అల్లుఅర్జున్,రష్మిక తో పాటు చిత్ర బృందం పాల్గొంటుంది.ఈ నేపథ్యంలోనే  మరి ప్రీ రిలీజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారనే చర్చ అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మొదలయ్యింది

నిజానికి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీ ఎత్తున జరగనుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చాయి.తొలుత ఎల్ బి స్టేడియం వేదికగా నిర్వహిద్దామని పుష్ప టీం భావించింది. ఇందుకు పోలీసు శాఖ అనుమతి కూడా అడిగారు. కానీ అక్కడ వేరే ప్రోగ్రాం ఉండటమో లేక మరే ఏ ఇతర కారణమో తెలియదు గాని పర్మిషన్ ఇవ్వలేదు.ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియం అడిగారు.కానీ పోలీసు శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. రీసెంట్ గా యూసఫ్ గూడ లోని పోలీసు హెడ్ క్వార్ట్రర్ లో జరుపుదామని అనుకోని పర్మిషన్ అడిగితే, ఈ మధ్యనే గ్రౌండ్ లోని ఒక చోట   కన్వెన్షన్ నినిర్మించడంతో,భారీ స్థాయిలో వచ్చే అభిమానులని దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో అసలు హైదరాబాద్ లో పుష్ప 2  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే టెన్షన్ మొదలయ్యింది. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here