వివాహ బంధమైనా, ప్రేమ బంధమైనా బలంగా ఉండాలంటే ఒకేలాంటి ఆలోచనా తీరు ఉండాలి. లేదా పరస్పరం గౌరవం ఇచ్చుకునే స్వభావం ఉండాలి. దీన్నే మనసులు కలవడం అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మనుసులు కలవడంతో పాటు వారి జాతకాలు కూడా కలవడం ముఖ్యం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయాన్ని బట్టి ఒక్కో వ్యక్తి ఒక్కో రాశికి చెంది ఉంటాడు. రాశులను బట్టి ఆయా వ్యక్తుల స్వభావాలు వేరు వేరుగా ఉంటాయి. అలా 12 రాశులలో ఒక రాశితో ఇంకొక రాశికి అన్యోన్యమైన రిలేషన్ ఉంటుంది. ఏ రాశి వారికి ఏ రాశి వారు కరెక్ట్ జోడీ అవుతారో తెలుసుకుంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. మీ రాశికి తగిన జోడీ ఎవరో తెలుసుకుని రియల్ లైఫ్లో అలాంటి వాళ్లు తారసపడితే అస్సలు వదలకండి. రాశుల మధ్య సరైన సమన్వయం కుదిరితే పరస్పర అనుకూలత, సహకారం, అనుకూలమైన పరిస్థితులు, సానుకూల మనోభావం, సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణాలు సాగుతాయి. మీ రాశిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీకు సరితూగగలిగే రాశులేంటో తెలుసుకోండి.