హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని 15వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి నవంబరు 30, డిసెంబర్ 1 తేదీలలో మార్గశిర అమావాస్య తిథి వచ్చింది. ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడం, శ్రాద్ధ కర్మ, పితృ తర్పణం చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో పవిత్రం కార్యాలుగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున, పితృ దోష నివారణం కోసం అనేక పనులు కూడా చేస్తారు. మార్గశిర అమావాస్య రోజున చంద్ర దేవుని ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఈ రోజున చంద్రుడిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికల నెరవేరుతుందని, జీవితంలో ఆనందం, శాంతి, ఆనందం లభిస్తుందని నమ్మిక. అయితే మార్గశిర్ష అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర్ష అమావాస్య రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here