ఈ ప్రపంచంలోని అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకం. పెళ్లయిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒక్కరు. వీరి బంధం ప్రేమ, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. వీరి బంధంలో అబద్ధాలు, మోసానికి చోటు లేదు. ఇద్దరూ తమ విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. రహస్యాలు లేకుండా జీవించాలి. అయితే భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలను దాస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. భార్యలు తమ భర్తలతో ఎన్నో విషయాలను పంచుకుంటున్నప్పటికీ, పంచుకోని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది . దీని వెనుక కొన్ని సరైన కారణాలు ఉన్నాయి. కాబట్టి భార్యలు తమ భర్తలతో కూడా పంచుకోలేని ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.