సిద్దార్ష్(siddharth)హీరోగా ఆషిక రంగనాధ్(ashika ranganath)హీరోయిన్ గా నటించిన చిత్రం ‘మిస్ యు'(miss you).ఎన్ రాజశేఖర్(rajasekhar) దర్శకత్వంలో శామ్యూల్ మధ్యు నిర్మాతగా వ్యవహరిస్తుండగాట్రైలర్ మరియు ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీకి జిబ్రాన్ సంగీతాన్నిఅందిస్తున్నాడు.
మిస్ యు మూవీ ఈ నెల 29 న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా పడింది. ఈ విషయంపై మేకర్స్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడవచ్చనే వాతావరణ శాఖ రిపోర్ట్ నేపథ్యంలో మా మూవీని వాయిదా వేస్తున్నాం.మాప్రేక్షకుల భద్రత మరియు సౌలభ్యం మా ప్రధాన బాధ్యత.ప్రతి ఒక్కరికి సురక్షితమైన మరియు ఆనందదాయమైన వాతావరణంలో సినిమా చూసేందుకు
గాను విడుదల ఆలస్యం చేస్తున్నాం.త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడి చేసారు.
కాగా ఇరవై తొమ్మిది రిలీజ్ డేట్ ని పురస్కరించుకొని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిద్దార్ధ్ మాట్లాడుతూ డిసెంబర్ 5 న పుష్ప 2(pushpa 2)సినిమా వచ్చినా కూడా మా సినిమాకి వచ్చిన ఇబ్బంది లేదు. మా సినిమా బాగుంటే థియేటర్స్ లో ఉంటుంది.సినిమా పధతికూడా అదే.ఒక మంచి సినిమాని ఎవరు కూడా థియేటర్స్ నుంచి తీసేయలేరని చెప్పిన మరుసటి రోజే మూవీ వాయిదా పడటం గమనార్హం.