అందరకి ఊహలని తలకిందులు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి కి గ్యాప్ ఇచ్చి ‘హరిహర వీరమల్లు’ ని పూర్తి చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా పార్ట్ 1 మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.దీంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ మేరకు ఇటీవల ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించగా,అందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఐదు వందల మందికి పాల్గొన్నారు.
ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఈ వారాంతంలో ప్రారంభం కానుంది.విజయవాడలో ప్రారంభం కాబోయే ఆ షెడ్యూల్ లో కథకి కీలకమైన కొన్ని యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ఇందులో పవన్ తో పాటు 200 దాకా పాల్గొంటున్నారు.ఇక ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని చిత్ర బృందం అధికారకంగా వెల్లడి చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఎందుకంటే వీరమల్లు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. కరోనా తో పాటు పవన్ పొలిటికల్ పనులు వలన సినిమా లేట్ అవుతు వచ్చింది. పైగా ఈ గ్యాప్ లో పవన్ వేరే సినిమాలని కూడా స్టార్ట్ చేసాడు.ఆ కోవలోనే వీరమల్లు తర్వాత స్టార్ట్ అయిన ‘బ్రో’ కూడా రిలీజ్ అయ్యింది. దాంతో ఒక దశలో వీరమల్లు ఆగిపోయిందేమో అనే చర్చ కూడా జరిగింది.
అలాంటిది ఇప్పుడు వీరమల్లు షూటింగ్ తుది దశకి చేరిందనే వార్త రావడంతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ కూడా వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి.శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.జ్యోతి కృష్ణ దర్శకుడు కాగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.