సోషల్ మీడియా వేదికగా మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకి ముందు మొదలైన మెగాఫ్యాన్స్,(mega fans)అల్లుఫ్యాన్స్(allu fans)మధ్య వార్ రానురాను విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది.చెన్నై వేదికగా మొన్న జరిగిన పుష్ప 2 ఈవెంట్ నే అందుకు ఒక ఉదాహరణ. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ అభిమాని రాసిన ఒక స్లోగన్ మెగా ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లోనే హర్ట్ చేసింది.అందుకు తగ్గట్టుగా మెగాఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు.దీంతో ఒకే కుటుంబానికి సంబంధించిన హీరోల గురించి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోవడంతో, ఫ్యాన్ వార్ ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి.పైగా పుష్ప 2 మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఈ వార్ పై సినీ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)రంగంలోకి దిగబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.పుష్ప 2(pushpa 2)రిలీజ్ కి ముందు, అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో చిరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి,ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవకి ఫుల్ స్టాప్ పెట్టనున్నాడనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫ్యాన్ వార్ పై చిరు బాగా సీరియస్ అయినట్లుగా కూడా అంటున్నారు.కుటుంబ బంధాలకు,బాంధవ్యాలకు చిరు చాలా విలువని ఇస్తారు.అల్లు అరవింద్(allu aravind)కూడా ఫ్యామిలీ రిలేషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు.ఈ విషయం చాలా సంధర్భాలలో బయటపడింది.
అందుకే చిరు మెగా అండ్ అల్లు గొడవకి చెక్ పెట్టనున్నాడని అంటున్నారు.దీంతో పుష్ప 2 కి సంబంధించిన ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని అంటున్నారు.ఇక అల్లు అర్జున్(allu arjun)చాలా సందర్భాల్లో కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానిని అని చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్ బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ షో లో కూడా బన్నీ ఈ విషయాన్నీ చెప్పాడు.