చంద్రబాబునాయుడు(chandrababu naidu)పవన్ కళ్యాణ్(pawan kalyan)లోకేష్(lokesh)పై గత ఎన్నికల ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)వివాదాస్పద ట్వీట్ లు చెయ్యడంతో పాటుగా ఆ ముగ్గురి ఫోటోలని మార్ఫింగ్ కూడా చెయ్యడంతో కొంత మంది అభిమానులు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు తో సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్మ పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ కేసులో వర్మ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో వర్మ ఈ రోజు ఏపి హైకోర్టులో పిటిషన్ వేసాడు.సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారు.చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులుపెట్టడం సమంజసం కాదని పిటిషన్లో పేర్కొంటూ తనపై నమోదయిన కేసుల్ని క్యాష్ చెయ్యాలని కోరాడు.వర్మ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కూడా అప్ప్లై చేసాడు. దీంతో ఈ రోజు రాబోయే కోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది.
ఇక అజ్ఞాతంలో ఉన్న వర్మ రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ పోలీసులకి సవాలు విసురుతున్నాడు.ఒక ఫేమస్ సినిమా యాక్టర్ వర్మ కి షెల్టర్ ఇచ్చాడనే వార్తలువస్తున్నాయి.మరోవైపు పోలీసులు మాత్రం వర్మ ఆచూకీ కోసం హైదరాబాద్, చెన్నై లో గాలింపు చేపడుతున్నారు.