ఆడి క్యూ7 ఫేస్ లిఫ్ట్: క్యాబిన్, ఫీచర్లు
2025 ఆడి క్యూ7 క్యాబిన్ లేఅవుట్ చాలావరకు ఒకేలా ఉంది. కొన్ని కొత్త ఇంటీరియర్ ట్రిమ్స్ ను యాడ్ చేశారు. అలాగే, ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై వంటి థర్డ్ పార్టీ యాప్ (apps) లను సపోర్ట్ చేసే అప్ డేటెడ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను పొందుపర్చారు. వర్చువల్ కాక్ పిట్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ లో కొత్త వార్నింగ్ ఇండికేటర్లతో పాటు అదనపు డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో ఎడిఎఎస్ సూట్ ను మెరుగుపరిచారు. 2025 ఆడి క్యూ 7 ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, 19-స్పీకర్ల బ్యాంగ్ & ఒలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్, కిక్ సెన్సార్ తో పవర్డ్ టెయిల్ గేట్, ఎలక్ట్రానిక్ గా ఫోల్డింగ్ చేయగల మూడవ వరుస సీట్లు, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ మొదలైన ఇతర ఫీచర్లు ఉన్నాయి. కొత్త క్యూ7 లో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎబిఎస్ విత్ ఇబిడి తదితర సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.