రెండు సార్లు మెగా చీఫ్
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో అవినాష్‌పై కూడా నోరు జారాడు పృథ్వీ. అప్పటికే రెండు సార్లు మెగా చీఫ్ అయిన అవినాష్‌ను అతను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తున్నాడని, ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది నబీల్ వల్ల, లక్ వల్ల హౌజ్‌లో ఉన్నావని తక్కువ చేసి మాట్లాడాడు పృథ్వీ. కట్ చేస్తే ఏమైంది, అదే పృథ్వీపై టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లిన రెండో కంటెస్టెంట్‌గా నిలిచాడు అవినాష్.