రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి సిద్ధమైంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.