నటుడు నాగార్జున దాఖలు చేసిన కేసులో మంత్రి కొండా సురేఖకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసును నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమెకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.