గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే.. అక్కడికి వెళ్లి అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయిని ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా శేఖర్, భానుప్రసాద్ అనే ఇద్దరిని పట్టుకొని విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుండి 10 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నరేష్, వర్ధన్ పరారీలో ఉన్నారు. త్వరలో ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు.