అగ్ర హీరో సూర్య(suriya)నవంబర్ 14 న పాన్ ఇండియా మూవీ ‘కంగువ'(kanguva)తో థియేటర్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విడుదలకి ముందు ఎంతో హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత అన్ని లాంగ్వేజెస్ లో కూడా డివైడ్ టాక్ ని తెచ్చుకుంది.అసలు కంగువ ప్లాప్ లేదని, సూర్య ఎదుగుదల తట్టులోలేని ఇద్దరు హీరోల అభిమానులు,రెండు రాజకీయ పార్టీలు కావాలని సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చారని ‘కంగువ’ నిర్మాతల్లో ఒకరైన ధనుంజయ్ పెద్ద బాంబ్ నే పేల్చాడు.ఈ మాటలు ఇప్పుడు సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇక సూర్య తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.సూర్య కెరిర్ లో నలభై ఐదవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆర్ జె బాలాజీ(rj balaji)దర్శకుడు కాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రభు,ప్రకాష్ బాబు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.ఈ మేరకు పొలాచ్చి లోని మాసాని అమ్మన్ టెంపుల్ లో బుధవారం పూజా కార్యక్తమాలతో ప్రారంభమయింది.ఆధ్యాత్మికత అంశాలతో పాటు యాక్షన్ కధాంశాలతో ముడి పడిన ఈ మూవీలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

దీంతో త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుండగా, ఇంకో హీరోయిన్ కి కూడా అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీలో నటించబోయే ఇతర నటి నటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.ఏఆర్ రెహ్మాన్(ar rehman)సంగీత సారధ్యంలో తెరకెక్కనుండగా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మూవీ విడుదల కానుంది. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here