సొంత సమాచారం జోడించవచ్చు..
గతంలో, వినియోగదారులు చిత్రాలు, డాక్యుమెంట్స్ లేదా ఇతర రకాల కంటెంట్ ను ఫార్వర్డ్ చేసేటప్పుడు నోట్స్ లేదా వివరణలను జోడించడానికి వీలుండేది కాదు. ఈ కొత్త ఫీచర్ తో ఆ సమస్య తొలగిపోతుంది. వినియోగదారులు తాము ఫార్వర్డ్ చేయాలనుకునే కంటెంట్ కు అదనంగా అవసరమైన సమాచారాన్ని యాడ్ చేసి పంపించవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు తాను ఫార్వర్డ్ చేయాలనుకునే ఒక ఇమేజ్ కు సందర్భాన్ని జోడించవచ్చు, దాని ఔచిత్యాన్ని వివరించవచ్చు లేదా ఆ విషయం బాగా అర్థం కావడానికి వివరణను యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ తో పాటు వాట్సాప్ ఇతర అప్ డేట్ లను కూడా ప్రవేశపెడుతోంది. ఇటీవల వాట్సాప్ ప్రారంభించిన ఫీచర్ వినియోగదారులు తమ వాయిస్ సందేశాలను టెక్స్ట్ లోకి మార్చడానికి వీలు కల్పించింది. ఇది వాయిస్ నోట్ లను అర్థం చేసుకోవడం సులభం చేసింది. ఇంకా, వాట్సాప్ లైట్, డార్క్ మోడ్స్ రెండింటికీ కొత్త థీమ్ రంగులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.