గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.చరణ్ మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తుండంతో పాటుగా,ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతుండంతో  మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి నిన్న ‘నానా హైరానా'(naanaa hyraanaa)అనే ఒక బ్యూటీ ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్  అవ్వగా ఇప్పుడు ఈ సాంగ్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ అన్ని భాషల్లో కలుపుకొని కేవలం పదిహేను గంటల్లోనే ట్వంటీ మిలియన్ వ్యూస్ ని సంపాదించింది. మెలోడీ సాంగ్స్  పరంగా చూసుకుంటే ఎన్టీఆర్(ntr)దేవరలోని చుట్టమల్లే సాంగ్, మహేష్(mahesh)కళావతి సాంగ్, అలా వైకుంఠపురం లోని ‘సామజ వరగమనా’ పుష్ప 2(pushpa 2)లోని ‘సుసెకీ అగ్గిరవ్వ మాదిరి’ సాంగ్స్ ‘నానాహైరానా’ సాంగ్ మాదిరిగా అంత తక్కువ వ్యవధిలో రికార్డు వ్యూస్ ని సంపాదించలేదు. మరి ముందు ముందు ఈ సాంగ్ మరిన్ని రికార్డ్స్ సాధిస్తుందో చూడాలి. తెలుగు సాంగ్ ఇప్పటికే పంతొమ్మిది మిలియన్ల వ్యూస్ ని సంపాదించింది.

చరణ్ సరసన కియారా అద్వానీ(Kiara Advani)జత కట్టగా అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో చెయ్యగా దిల్ రాజు(dil raju)నిర్మాతగా వ్యవరిస్తుండగా థమన్(thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here