2013 లో మోహన్ లాల్(mohan lal)హీరోగా వచ్చిన ‘లోక్ పాల్’ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మలయాళ నటి దివ్య ప్రభ(divya prabha)ఆ తర్వాత  ముంబై పోలీస్,కోల్డ్ స్టోరేజ్,సిమ్,టేక్ ఆఫ్,తమాషా,మాలిక్ వంటి పలు సినిమాల్లో ప్రాధాన్యత క్యారెక్టర్స్ లో చేసి ప్రేక్షకులని మెప్పించిన దివ్య ప్రభ  2022 లో వచ్చిన ‘అనియప్పు’ అనే   చిత్రం ద్వారా సోలో హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. రీసెంట్ గా ‘ఆల్ వుయ్  ఇమాజిన్ ఆజ్ లైట్’ అనే మూవీలో చెయ్యగా ఇండియాతో పాటు మరో నాలుగు దేశాల్లో ఆ మూవీ విడుదల అయ్యింది.

ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అందులో ఆమె నటించిన ఒక న్యూడ్ సీన్ క్లిప్ ని నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు.ఇప్పుడు వాటిపై దివ్య ప్రభ మాట్లాడుతూ ఈ మూవీ ఒప్పుకున్నప్పుడే ఇలాంటివి వస్తాయని ముందుగానే ఊహించాను.నేను న్యూడ్  సన్నివేశంలో నటించడాన్ని తప్పుబడుతున్నారు. సినిమా మొత్తం చూడకుండా కేవలం ఆ సన్నివేశం మాత్రమే షేర్ చేస్తున్న వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది.

నేను గుర్తింపు కోసమే అలాంటి క్యారక్టర్ ని  చేసానని అంటున్నారు.ఒక నటిగా మంచి ప్రాధాన్యత గల పాత్రలనే అంగీకరిస్తాను.ఈ సినిమాలో నా పాత్ర నచ్చి అవసరం మేరకే నటించాను.అంతే గాని గుర్తింపు కోసం నగ్నంగా నటించాలనే అవసరం లేదు ఇప్పటికే నేను నటించిన చాలా చిత్రాలకి పలు పురస్కారాలు ప్రశంసలు దక్కాయని చెప్పుకొచ్చింది ఇక ఈ సినిమా ఇండియాలో సెప్టెంబర్ 21 న రిలీజ్ అవ్వగా రానా దగ్గుబాటి దేశ వ్యాప్తంగా విడుదల చేసాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here