కృష్ణా జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమ పేరుతో బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాలికకు, బాలుడికి బాల్య వివాహం చేయాలనుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు జోక్యం చేసుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాలికను విజయవాడంలోని చిల్డ్రన్ హోంకు తరలించారు.