వెబ్ సిరీస్ : పారాచూట్
నటీనటులు: కిషోర్, కని తిరు, శక్తి రిత్విక్, ఇయల్, కృష్ణ , కాళి వెంకట్ తదితరులు
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కె. శ్రీధర్
ఎడిటింగ్: ఎ. రిచర్డ్ కెవిన్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్
నిర్మాతలు: కె.ఎస్ మధుబాలన్, కృష్ణ కులశేఖరన్
దర్శకత్వం: రసు రంజిత్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
షణ్ముగం(కిశోర్), లక్ష్మీ (కని తిరు) ఇద్దరు భార్యాభర్తలు. వారిద్దరికి వరుణ్(శక్తి రిత్విక్), రుద్ర(ఇయల్) పిల్లలు. ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుతుంటారు. అయితే వరుణ్ కి చదువు మీ శ్రద్ధ లేకపోవడం, ఆటలంటే ఇష్టం ఉండటంతో అతడిని వాళ్ళ నాన్న షణ్ముగం కొడుతుంటాడు. అయితే షణ్ముగం ఇంటింటికి తిరిగి సిలిండర్లు వేస్తుంటాడు. అతను నిజాయితీగా డ్యూటీ చేస్తున్నప్పటికీ, ఒక చిన్న వివాదం కారణంగా అతడి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ వేస్తారు. దీంతో పోలీస్ అతడి మీద గుర్రుమంటాడు. ఇక అదే సమయంలో వారిద్దరి పిల్లలు కలిసి తన తండ్రి షణ్ముగం బైక్ పారాచూట్ ని వేస్కొని బయటకు వెళ్తారు. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్(కృష్ణ) ఓ డ్రంక్ డ్రైవ్ కేసులో గొప్పింటి వ్యక్తి బైక్ ని తీసుకొని, అతడి మీద చేయి చేస్కుంటాడు. సీజ్ చేసిన ఆ బైక్ ని కొంతమంది దుండగులు తీసుకెళ్తారు. అది గొప్పింటి వ్యక్తి విషయం కావడంతో పోలీస్ ఆఫీసర్ కృష్ణకి పైనుండి ప్రెషర్ వస్తుంది. అసలు పారాచూట్ ని తీసుకెళ్ళిన పిల్లలు ఏమైపోయారు ? పోలీసులు గొప్పింటి వ్యక్తి బైక్ ని కనిపెట్టగలిగారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రులంటే భయం కచ్చితంగా ఉంటుంది. ఆ క్రమంలో పిల్లలు ఏవైనా తప్పులు చేస్తే వారికి తెలియకుండానే భయం వారిని వెంటాడుతుంది. అదే సమయంలో తప్పిపోయిన పిల్లలు, పారాచూట్ అనే బైక్, పోలీసులు ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఓ వైపు.. ఇలా నాలుగు రకాల భిన్నమైన సమస్యలు ఈ సిరీస్ లో సమానంగా సాగుతుంటాయి.
కథ మొదలవ్వడమే ఓ ప్రాబ్లమ్ తో మొదలవుతుంది. ఇక మొదటి ఎపిసోడ్ లో పిల్లల మీద తండ్రి కోపం, తల్లి అన్యోన్యత ఇలా సెంటిమెంట్ తో సాగగా.. మూడో ఎపిసోడ్ , నాల్గో ఎపిసోడ్ ఇలా ఒక్కో ఎపిసోడ్ లో పిల్లలు ఎక్కడున్నారో వెతుకుతున్న తల్లిదండ్రులని చూస్తుంటే అందరు కనెక్ట్ అవుతారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలోని వారంతా ఈ సిరీస్ కి కనెక్ట్ అవుతారు. ఫ్యామిలితో కలిసి చూసేలా దర్శకుడు తీర్చిదిద్దారు.
అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. అశ్లీల పదాలు వాడలేదు. కథకి తగ్గట్టుగా సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. ఓమ్ నారాయణ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నైట్ ఎఫెక్ట్ లోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు మంచి మార్కులు కొట్టేస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం, ఈ సిరీస్ కి హైలైట్. కానీ పాటలని తమిళంలోనే ఉంచేశారు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
షణ్ముగం పాత్రలో కిశోర్, లక్ష్మీ పాత్రలో కని తిరు ఆకట్టుకున్నారు. శక్తి రిత్విక్, ఇయల్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా…
ఫ్యామిలీతో కలిసి చూసే పారాచూట్. మస్ట్ వాచెబుల్.
రేటింగ్ : 3/5
✍️. దాసరి మల్లేశ్