జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయాన్ని బట్టి ఒక్కో వ్యక్తి ఒక్కో నక్షత్రానికి చెందినవాడుగా పరిగణిస్తారు. ప్రత నక్షత్రానికి ప్రత్యేక శేలి ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి ఆయా వ్యక్తుల గుణగణాలు, వ్యక్తిత్వం, విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం వంటి వాటిని తెలుసుకోవచ్చు. గ్రహాల కదలికల్లో మార్పును బట్టి వారి భవిష్యత్తును అంచనా వేయచ్చు. 2025 సంవత్సరం మొదటి నెల నుండి చివరి నెల వరకూ అశ్విని నక్షత్రం లో జన్మించిన వారికి వివిధ అంశాల్లో అనేక మార్పులు ఉంటాయి. ఈ సంవత్సరంలో వారు ఎదుర్కొనే సవాళ్లు మరియు అవకాశాలు ఎలా ఉంటాయి అనేది వారి కష్టాలు, విజయాలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ మరియు కుటుంబ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.